News

డ్రగ్స్ కేసులో పలువురు పెద్ద హీరోలు కూడా


భారతీయ జనతా యువమొర్చా(బీజేవైఎం) డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలను తప్పించారని ఆరోపించింది. ఈమేరకు నగరంలోని ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం నేతలు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ... అసలు నిందితులను అరెస్ట్ చేసేవరకు పోరాటం కొనసాగుతుందని బీజేవైఎం నేతలు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పలువురు పెద్ద హీరోలు కూడా ఉన్నారన్నారు. అయితే వారిని తప్పించారని పేర్కొన్నారు.